చిరంజీవి ఇమేజ్‌కు అనుగుణంగా `లూసిఫర్` కథకు దర్శకుడు కొన్ని మార్పులు చేస్తున్నారట. `లూసిఫర్`లో మోహన్ లాల్ పాత్ర మొదట్నుంచి చివరి వరకు చాలా సీరియస్‌గా ఉంటుంది. పంచెక్టులో మోహన్‌లాల్ చాలా హూందాగా కనిపిస్తారు. అలాగే సినిమాలో హీరోయిన్ ఉండదు. పాటలు కూడా ఉండవు. అయితే తెలుగు ప్రేక్షకులు వీటిని అంగీకరించడం కాస్త కష్టమే. కాబట్టి ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్టుగా మారుస్తున్నారట. చిరంజీవి పాత్రకు కాస్త హ్యూమర్‌ను జోడిస్తున్నారట.
అలాగే తెలుగు రీమేక్‌లో హీరోయిన్ పాత్ర కూడా ఉంటుందని టాక్. చిరంజీవి నుంచి మాస్ అభిమానులు కోరుకునే అన్ని అంశాలనూ ఈ చిత్రంలో జోడిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి, ఈ మార్పు చేర్పులు సినిమాకు ప్లస్ అవుతాయో, మైనస్ అవుతాయో చూడాలి. అలాగే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నారని సమాచారం. లాక్‌డౌన్ సమయంలో తన నటన ద్వారా మంచి నేమ్, ఫేమ్‌ను సత్యదేవ్ సంపాదించుకున్నారు. చిరు సినిమాలో ఛాన్స్ కొట్టేయడంతో ఇది ఆయన కెరీర్‌కే తిరుగులేని టర్నింగ్ పాయింట్ కానుంది.