
ధురంధర్ సినిమాతో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ సారా అర్జున్, ఇప్పుడు ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత సవాల్‌తో కూడిన పాత్రకు సిద్ధమవుతోంది. లెజెండరీ నటి, వెండితెర అందాల దేవత మధుబాల బయోపిక్‌లో సారా టైటిల్ రోల్ పోషించనున్నట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో, జస్మీత్ కె రీన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై అప్పుడే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి..
నిజానికి ఈ ఐకానిక్ పాత్ర కోసం మేకర్స్ మొదట కియారా అద్వానీ, సాయి పల్లవి వంటి స్టార్స్ ను పరిశీలించారు. కానీ, ‘ధురంధర్’ చిత్రంలో సారా అర్జున్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, ఈ పాత్రకు ఆమెనే సరైన ఎంపికని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మధుబాల జీవితంలోని అంతుచిక్కని రహస్యాలు, ఆమె సినీ ప్రస్థానం మరియు వ్యక్తిగత ఎమోషన్స్ ఈ చిత్రం ద్వారా పాన్-ఇండియా స్థాయిలో ఆవిష్కరించనున్నారు. మధుబాల లాంటి గ్రేస్, అందం మరియు నటనను ప్రతిబింబించడం సారా అర్జున్‌కు అంత సులభమైన విషయం కాదు. ఇది ఆమె కెరీర్‌ను మలుపు తిప్పే అద్భుతమైన అవకాశం అయినప్పటికీ, ఆమె నటనకు ఇది అసలైన పరీక్ష అని చెప్పాలి..
