నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు సినిమాలో ఫీమేల్ క్యారెక్టర్స్ చాలా పవర్ ఫుల్ అని హీరోయిన్ సప్తమి గౌడ్ అన్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మూవీ జులై 4న రిలీజ్ అవుతున్న సందర్భంగా హీరోయిన్ సప్తమి గౌడ ప్రమోషన్లలో పాల్గొన్నారు. మూవీలో హీరోతో పాటు ఫీమేల్ పాత్రలకు సమానమైన బాధ్యత ఉంటుందన్నారు.
ఈ సినిమాతో నాకు మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. నాది చాలా ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్. రత్న పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. ఇందులో హీరో గారిపాత్ర చుట్టూ మా పాత్రలు తిరుగుతాయి. నేను, వర్ష..ఇలా మా అందరికీ ఫైట్ సీక్వెన్స్ లు ఉంటాయి. ఇందులో ఫీమేల్ క్యారెక్టర్లు ఫైట్ సీన్స్ కూడా చేస్తారు. అదే ఇక్కడ డిఫరెంట్. వేణు శ్రీరామ్ గారి సినిమాల్లో లేడీస్ కు బలమైన పాత్రలే ఉంటాయి. ఇందులోనూ అదే జరిగింది. నితిన్ గారితో నాకు లవ్ ట్రాక్ ఉంటుంది. మూవీ చూసిన వారంతా మేం కలవాలని కచ్చితంగా కోరుకుంటారు..!!