జొన్నలగడ్డ వెంకట సోమయాజులు అంటే చాలామంది గుర్తు పట్టక పోవచ్చు , శంకరాభరణం శంకర శాస్ట్రీ అంటే తెలియని వారుండరు తెలుగునాట. వృత్తి రీత్యా ఆయన సబ్ కలెక్టర్, ప్రవృతి రీత్యా ఆయన ఒక నటుడు, ఎన్నో స్టేజి నాటకాలు నటించిన సోమయాజులు గారు నటించిన మొదటి చిత్రం శంకరాభరణం అనుకుంటారు అందరు, మీరు కూడా అదే అనుకుంటే పప్పులో కాలేసినట్లే. సోమయాజులు గారు నటించిన మొదటిచిత్రం k. రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్ లో 1976 లో వచ్చిన ” జ్యోతి”.
జ్యోతి చిత్రం డైరెక్టర్ గ రాఘవేంద్ర రావు గారికి రెండో చిత్రం, జయసుధ గారికి మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం. ఆ తరువాత 1979 లో చంద్ర మోహన్ హీరో గ నటించిన “రారా కృష్ణయ్య” అనే చిత్రం. 1980 లో విశ్వనాధ్ గారి డైరెక్షన్ లో శంకరాభరణం చిత్రంలో నటించటం జరిగింది. ఒక విధంగా శంకరాభరణం ఆయనకు మూడో చిత్రం అని చెప్ప వచ్చు, కానీ సోమయాజులు గారు నటుడిగా ప్రేక్షకులు గుర్తించింది మాత్రం శంకరాభరణం చిత్రం తోనే.