ఎంత పెద్ద హీరో అయినా..హీరో ఇజం, ఆడంబరాలు, మేకప్ ఎక్కువగా లేకుండా..సినిమా తీయడమే ఆయనలో ఉండే స్పెషల్. ఎంత ఫేమ్ ఉన్న నటీనటులైనా ఆయన ఎలా చెబితే అలా వినాల్సిందే. పనివాడు, మూగవాడు,గుడ్డివాడు,చెప్పులుకుట్టేవాడు ఇలా ఆయన కథకు తగ్గట్టు ఆ పాత్రలో జీవించేలా..వారిలో రియల్ గా ఉండే నటులను బయటకు లాగడంలో ఆయన చాలా స్ట్రాంగ్. దానికి కారణం నటీనటులకు, తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఆయన మీద ఉండే ప్రత్యేకమైన గౌరవం.
విశ్వనాథ్ గారి జీవితంలో తీసిన సినిమాల్లో మైల్ స్టోన్ సినిమా అంటే శంకరాభరణం. ఈ సినిమా తమిళ్ లో కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. పైగా ఆ సినిమా అస్సలు ఎవ్వరూ చూడరని, అట్టర్ ప్లాప్ అవుతుందని నవ్వారంట. అప్పుడు ఆ సినిమాని రు. 50 వేలకు మొత్తం తమిళ్ రైట్స్ ని మనోరమ కొనుక్కున్నారంట. ఆ రోజుల్లో ఆమెకు ఆ సినిమా కోట్ల రూపాయలు సంపాదించి పెట్టింది అంట. ఆరోజుల్లో 50 వేలు పెట్టుబడితో, కోట్లు సంపాదించడం అంటే మామూలు మాట కాదు. ఆమె నిర్ణయం ఆమెకు అంత లాభాన్ని తెచ్చింది..!!