ప్రస్తుతం, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత ఆయన త్వరలో యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ పై దృష్టి పెట్టనున్నారు. అందుకే ప్రభాస్ సినిమా షూటింగ్‌ను ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. స్పిరిట్ సినిమా కేవలం ఆరు నెలల్లోనే రెడీ అవుతుందని చెబుతున్నారు..
ఈ సినిమాకు అత్యంత ముఖ్యమైన అంశం ప్రభాస్ లుక్. ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంటుగా కనిపిస్తారని అంటున్నారు. యంగ్ లుక్ లో కనిపించడం కోసం ప్రభాస్ తన బరువు తగ్గించుకోవాల్సి ఉంటుందని, కొత్త హెయిర్‌స్టైల్‌ను ప్రయత్నిస్తారని సమాచారం. అలాగే, ఈ సినిమా కోసం ప్రభాస్ ఇంతకుముందు ఎప్పుడూ వేసుకోని దుస్తులను ధరించబోతున్నారు. ఈ పాత్ర ప్రభాస్‌ను తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకువస్తుందని, ఇది ఆయనకు మొదటి డార్క్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ కావడంతో ఒక కొత్త జోన్‌లోకి వెళ్తారని చెబుతున్నారు..!!