in

samyuktha menon joins vijay sethupathi – puri jagannadh’s beggar!

పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ తర్వాత కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో సినిమా లాక్ చేసుకున్నాడు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సినిమా ఓకే చేశాడు అంటే అందులో కచ్చితంగా సంథింగ్ స్పెషల్ ఉంటుంది. అందులోనూ ఫ్లాపుల్లో ఉన్న పూరీ తో సినిమా అంటే ఆయన ఈసారి ఇంప్రెస్ చేసే కథతో వస్తున్నారని చెప్పొచ్చు. పూరీ విజయ్ సేతుపతి సినిమాలో ఇప్పటికే టబు, దునియా విజయ్ ని సెలెక్ట్ చేశారు. ఇక లేటెస్ట్ గా సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ ని ఫిక్స్ చేశారు..

మలయాళ భామ సంయుక్త తన మార్క్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. పూరీ విజయ్ సేతుపతి సినిమాలో ఆమె పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. రెగ్యులర్ సినిమాల్లో పాత్రల్లో కాకుండా ఈసారి సంయుక్త డిఫరెంట్ రోల్ చేస్తుందని టాక్. విజయ్ సేతుపతి పూరీ కాంబో సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలిసిందే. ఐతే ఇప్పుడు ఆ టైటిల్ ని బిక్షాం దేహి అని మారుస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే ఫైనల్ టైటిల్ ఏంటన్నది మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది..!!

Ram Charan’s ‘Peddi’ bags whopping Rs 105 cr OTT deal

Prabhas himself wanted 2 heroines for ‘raja Saab’!