in

samyuktha menon gets a mega jackpot in telugu!

అమ్మ‌డు..ప్రస్తుతం రెండు ప్రాజెక్టులలోన‌టిస్తుంది. వాటిలో ఒకటి నందమూరి బాలకృష్ణ అఖండ 2 కాగా.. మ‌రోక‌టి నిఖిల్ సిద్ధార్ధ్‌.. స్వయంభు. ఈ రెండు సినిమాల్లో సంయుక్త మీనన్ మెర‌వనుంది. స్వయంభూ సినిమాలో హీరోయిన్గా అమ్మడు నటిస్తుండగా.. అఖండ 2 మూవీలో.. ఓ కీలక‌ పాత్ర కోసం సంయుక్త మీనన్ మెరవనుంది. ఇలాంటి క్రమంలోనే మరోసారి అమ్మడు జాక్పాట్ ఆఫర్ కొట్టేసిందని..టాలీవుడ్ బిగ్ బడా హీరోకు జంటగా నటించిన ఛాన్స్ కేరళ కుట్టి దక్కించుకుందంటూ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది..

ఇంతకీ..ఆ స్టార్ హీరో మరెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా మెర‌వ‌నుందట. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభ‌ర సినిమా షూట్ పనులు పూర్తి చేసుకొని..అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగా 157 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయనతార హీరోయిన్. ఇక ఈ సినిమా షూట్ అయిన తర్వాత..మెగాస్టార్ మరోసారి బాబీ డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక బాబీ, మెగాస్టార్ కాంబోలో రూపొందనున్న ఈ సినిమాలో చిరుతో న‌టించే ఛాన్స్ సంయుక్త కొట్టేసింద‌ట‌..!!

is samantha quitting the movies?