నటుడు దర్శకుడు సముద్రఖని అంటే చాలామందికి తెలియకపోవచ్చు. కటారి కృష్ణ అంటే అందరు గుర్తిస్తారు ప్రస్తుతం. సముద్రఖని ని ఆత్మహత్య ప్రయత్నం నుంచి, జీవితం వైపు మరలించిన ఒక అజ్ఞాత వ్యక్తి. సినిమా ప్రయత్నాలు చేస్తూ, తినటానికి తిండి లేక కనీసం కాళ్లకు చెప్పులు లేక, వట్టి కాళ్ళతో నడిచి గాయాలు అయిన పాదాలు సలుపుతుంటే పక్క రూమ్ వాడి బాత్రూం స్లిప్పర్స్ వేసుకొని రోడ్ మీదకు వచ్చిన సముద్రఖని ని వెంటాడి, అందరి ముందు అవమానించాడు అతను. దానితో మానసిక క్షోభకు గురి అయిన సముద్రఖని చనిపోవాలని రైలు పట్టాల వైపు వెళుతుంటే దారిన పోయే ఒక బైకర్ అతనికి లిఫ్ట్ ఇచ్చి, మీరెందుకో ఏడుస్తున్నారు, కానీ ఒక్కటి గుర్తుంచుకోండి మీరు ఏడిచేకొద్దీ ఈ ప్రపంచం మిమల్ని మరింత ఏడిపిస్తుంది, నిబ్బరంగా ఎదుర్కోండి, జీవితంలో ముందుకు వెళతారు అని చెప్పి వెళ్ళిపోయాడు..
అంతే తన కోసం కొన్ని సీన్స్ వ్రాసుకొని ఒక టీ. వి. సీరియల్ డైరెక్టర్ దగ్గరకు వెళ్లి నటించి చూపించాడు, నీ యాక్టింగ్ కంటే నీ రైటింగ్ స్కిల్స్ బాగున్నాయి, నా దగ్గర అసిస్టెంట్ గ చేరు అని, అసిస్టెంట్ డైరెక్టర్ చేసేసాడు అతను. బాలచందర్ గారి వద్ద అసోసియేట్ స్థాయి ఎదిగాగక, కొన్ని సినిమా లు డైరెక్ట్ చేసారు,” సుబ్రమణ్య పురం” సినిమాతో నటుడిగా మారి, “విచారణై” అనే సినిమా తో 2016 లో జాతీయ ఉత్తమ సహాయ నటుడి స్థాయి కి ఎదిగారు. “అల వైఖుంఠపురం లో ” అప్పల నాయుడు పాత్ర, ” క్రాక్” సినిమా లో “కటారి కృష్ణ” పాత్ర తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు సముద్రఖని. ఆ అజ్ఞాత వ్యక్తి కి మనందరం థాంక్స్ చెప్పాలి, అతనే లేకుంటే ఒక మంచి నటుడు రైలు పట్టాల మీద గుర్తు తెలియని శవం అయుండే వాడు..