సమంత తాజాగా కోలీవుడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ‘గోల్డెన్ క్వీన్’ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్, వ్యక్తిగత బంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో తనకున్న అనుబంధం గురించి ఆమె భావోద్వేగంగా మాట్లాడారు. తనకు ఆరోగ్యం బాగాలేని క్లిష్ట సమయంలో రాహుల్ రవీంద్రన్ అండగా నిలిచాడని సమంత తెలిపారు. “ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటూ రాహుల్ నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు..
మా బంధానికి ఓ పేరు పెట్టలేను. స్నేహితుడా, సోదరుడా, కుటుంబ సభ్యుడా అనేది చెప్పలేను” అంటూ రాహుల్‌పై తనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచారు. అభిమానుల మద్దతు తన అదృష్టమని, తన కష్టం, లక్ వల్లే ఇంత ఆదరణ లభిస్తోందని ఆమె పేర్కొన్నారు. కెరీర్ గురించి మాట్లాడుతూ, “మనం తీసుకునే ఒక్క నిర్ణయాన్ని బట్టి కెరీర్ ఎలా ఉంటుందో చెప్పలేం. తెలిసీ, తెలియక తీసుకునే ఎన్నో నిర్ణయాలు మన ప్రయాణంపై ప్రభావం చూపుతాయి” అని సమంత అన్నారు..!!