in

samantha: women tend to apologise more frequently than men

మంత..మహిళల స్థితిగతులపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకున్నారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సమాజంలో ఇతరుల సౌకర్యం కోసం మహిళలు తమ అభిప్రాయాలను, షెడ్యూళ్లను, చివరికి తమ ఆశయాలను కూడా త్యాగం చేయడం ఒక సాధారణ విషయంగా మారిపోయిందని సమంత పేర్కొన్నారు. తమ వ్యక్తిత్వాన్ని పక్కనపెట్టి ఇతరుల కోసం జీవించడం, వెనక్కి తగ్గడం మహిళలకు అలవాటైపోయిందని అన్నారు. ఈ త్యాగాలను చాలాసార్లు వారే గుర్తించలేని స్థితిలో ఉంటారని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా మహిళలకు ఆమె ఒక ముఖ్యమైన పిలుపునిచ్చారు. పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా క్షమాపణలు చెబుతుంటారని, ప్రతి చిన్న విషయానికీ ‘సారీ’ చెప్పే అలవాటును ఇకనైనా ఆపాలని సూచించారు. “మనం మన స్థానాన్ని అర్హతతోనే సంపాదించుకున్నాం. కాబట్టి ఎవరైనా ప్రశంసించినప్పుడు దాన్ని గర్వంగా స్వీకరించాలి” అని సమంత అన్నారు. సినిమాల విషయంలో సామ్‌ మాట్లాడుతూ..ఒక చిత్రాన్ని ‘ఫీమేల్ లీడ్’ సినిమా అని ప్రత్యేకంగా ట్యాగ్ చేయాల్సిన అవసరం లేని రోజు రావాలని ఆకాంక్షించారు. మహిళా పాత్రలు కేవలం హీరోకు సహాయపడేవిగా కాకుండా, స్వతంత్రంగా నిలబడేలా శక్తిమంతంగా ఉండాలని స్పష్టం చేశారు..!!

telugu girl Sri Gouri Priya signs multiple tollywood projects!

Ustaad Bhagat Singh director Harish Shankar responds to trolls!