అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం అట్లీ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. వీడియో చూస్తే.. ఇదో సైన్స్ ఫిక్షన్ సినిమా అనిపిస్తోంది. అయితే అట్లీ అంతకు మించిన ప్రయత్నం, ప్రయోగం ఏదో చేయబోతున్నాడన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.600 కోట్లు కూడా ఉంటుందని అంటున్నారు. పుష్పతో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరాడు బన్నీ. ఇప్పుడు మరోసారి ఈ క్లబ్‌లో తన పేరు చూసుకోవాలని ఆరాట పడుతున్నాడు..
కథానాయిక పాత్ర కోసం సమంత పేరు పరిశీలిస్తున్నారన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో బన్నీ – సమంత జంటగా నటించారు. ఆ తరవాత పుష్పలో ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది సమంత. ఆ తరవాత ఇద్దరూ జోడీ కట్టడం ఇదే తొలిసారి. అయితే ఈమధ్య సమంతకు యాక్షన్ ఇమేజ్ వచ్చేసింది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటోంది. ఈ సినిమాలోనూ సమంత పాత్ర కొత్తగా ఉంటుందని, ఆమెను గ్లామర్ డాళ్‌గా చూపించడం లేదని తెలుస్తోంది..!!