
స్టార్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించనున్నట్లుగా సమాచారం. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది. అయితే, ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత నటించనుంది. ఇక రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌తో సమంత పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే..
