హీరోయిన్ సమంత రూత్ ప్రభు కొత్త వ్యాపారం ప్రారంభించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లలో బిజీబిజీగా ఉన్నప్పటికీ కొత్త వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమచారం. ఇప్పటికే ఓ ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించిన సమంత..తాజాగా పెర్ఫ్యూమ్ రంగంలోకి అడుగుపెట్టనుంది. లగ్జరీ పెర్ఫ్యూమ్ ను మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం..
పెర్ఫ్యూమ్ కంపెనీ పెట్టి తనే అంబాసిడర్ గా ప్రచారం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఈ ప్రోడక్ట్ విషయంలో సమంత భారీ స్థాయిలో ఖర్చుపెడుతున్నారని తెలుస్తోంది. హీరోయిన్ గా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా సమంత దూసుకు వెళ్తున్నారు. ఈ కొత్త వ్యాపారంలోనూ సమంత విజయం సాధించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు..!!