ఏమాయ చేసావే’ మూవీతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న సమంత .. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్‌తో పాటు నటిగా కూడా పేరు తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు వచ్చాయి. తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ భాషల్లోని స్టార్ హీరోలందరితో నటించింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి కావడంతో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డును సమంత తాజాగా అందుకుంది. ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఈవెంట్‌లో సమంతకు ఈ అవార్డు బహూకరించారు..
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తొలి చిత్రం ఏ మాయ చేశావే గురించి ఆసక్తికర విషయాలను ఆమె పంచుకుంది. అక్కినేని నాగ చైతన్య తో ఏ మాయ చేసావే సినిమాతో సమంత సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో తన తొలి చిత్రం గురించి సమంత మాట్లాడుతూ..ఆ మూవీలోని ప్రతి షాట్ తన జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పింది. ఈ మూవీలో జెస్సీ పాత్రలో కార్తీక్‌ను గేట్ దగ్గర కలిసే సీనే తన ఫస్ట్ షాట్ అని, అది తనకు జీవితాంతం గుర్తిండిపోతుందని అన్నారు..!!