సమంత ప్రస్తుతం సినిమాల విషయంలో గతంతో పోలిస్తే 90% స్పెస్ తగ్గించేసింది. బాలీవుడ్ లోనే అడపాదడపా సినిమాలు చేస్తూ..పలు ఇంట్రెస్టింగ్ సిరీస్‌లలో మాత్రమే నటిస్తున్న ఈ అమ్మడు..తాజాగా ఓ టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ మూవీ మరేదో కాదు పెద్ది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో.. చరణ్ పక్కన స్పెషల్ సాంగ్ లో సమంత మెరవనుందని సమాచారం..
ఇక టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సుక్కు తన ప్రతి మూవీలో స్పెషల్ సాంగ్ ఉండేలా చూసుకుంటారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శిష్యుడు బుచ్చిబాబు కూడా గురువు నే ఫాలో అవుతూ..పెద్ది సినిమాకు స్పెషల్ సాంగ్ ఫిక్స్ చేశాడట..ఇక మూవీ స్టోరీకి అనుగుణంగా సమంతతో స్పెషల్ సాంగ్ పెట్టాలని టీం ప్లాన్ చేస్తున్నారట..!!