in

samantha silence adding more fuel to the dating rumors!

సోషల్ మీడియాలో పలువురు సామ్ ని పెళ్ళెప్పుడు, ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటారని అడిగినా, తనకి మళ్ళీ పెళ్లి పై  ఆసక్తి లేదని, రెండో పెళ్లి చేసుకునేంత ఓపిక లేదని చెప్పింది. కానీ ఇప్పుడు సామ్ రిలేషన్ పై ప్రచారం జరుగుతోంది. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో ఓటీటీ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సామ్ ఆ సిరీస్ నిర్మాతల్లో ఒకరైన రాజ్ తో రిలేషన్ లో ఉన్నట్లు టాక్. అతని పూర్తి పేరు రాజ్ నిడుమోరు. రిలేషన్ షిప్ ఉన్న కారణంగా సామ్ వారితోనే వరస సిరీస్ లు చేస్తోందని సమాచారం.  ఫ్యామిలీ మ్యాన్ 2 టైంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా..

తరవాత అది ప్రేమగా మారిందని, అక్కడ నుంచి కలిసి జర్నీ చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే  సిటాడెల్ సిరీస్ లో మళ్ళీ సామ్ నే తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకో సిరీస్ కి రాజ్ కి ఓకే చెప్పింది సామ్. గతంలో కూడా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు చాలానే వైరల్ అయ్యాయి. సమంత పుట్టిన రోజుని రాజ్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసాడు. ప్రస్తుతం సామ్, అండ్ రాజ్ డేటింగ్ చేస్తున్నారని, లవ్ లో ఉన్నారని, బాలీవుడ్ లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రాజ్ ప్రోత్సాహం తోనే సామ్ కూడా నిర్మాతగా మారిందని టాక్. వీరితో కలిసి సమంత రెండు వెబ్ సిరీస్ లు నిర్మించేందుకు రెడీ అయ్యింది..!!

Here’s the Truth Behind Car Accident Rumours!

Mr. Bachchan Telugu Movie Review!