
మా కోడలు కు వంట చేయడం రాదు. చైతూ మాత్రం చక్కగా వంట చేస్తాడు’ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కోడలు సమంత గురించి వ్యాఖ్యానించింది అక్కినేని అమల. ఆమె మాటలు కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ‘నువ్వు వంట చేయడం ఎందుకు నేర్చుకోలేదు’ అంటూ సమంతపై అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. అయితే అత్తగారి మాటల్ని ఛాలెంజ్‌గా తీసుకున్న సమంత ముష్రుమ్ పాస్తాను చక్కగా తయారుచేసి తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. ‘సుదీర్ఘ విరామం తర్వాత మీ ముందుకొచ్చాను. అందరూ ఇంట్లో ఉంటూ క్షేమంగా ఉండండి’ అంటూ సమంత అభిమానులకు సలహా ఇచ్చింది. అయితే ఎప్పుడు వంట ముచ్చట్లను సోషల్‌మీడియాలో ప్రస్తావించని సమంత..ఏకంగా పాస్తా చేసి చూపెట్టడంతో అత్తయ్య అమల మాటల్ని ఆమె సవాలుగా తీసుకుందంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

