
కేవలం తన అందాల ఆరబోతతోనే కాకుండా నటన మీద తనకున్న ప్రేమ, కృషి, పట్టుదలతో ఈరోజు సౌత్ సినిమా ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ గ ఎదిగింది సమంత. ఈ జనరేషన్ హీరోయిన్స్ లో..ఎలాంటి రోల్ అయిన చేయగల అతికొద్దిమంది హీరోయిన్స్ లో సమంత ఒకరు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంక అసలు విషయంలోకి వెళ్తే.. సమంత టాలీవుడ్ స్టార్ హీరోస్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. స్టార్ హీరోస్ తో కలిసి చేసిన హీరోయిన్స్ కు సరైన గుర్తింపు రావట్లేదు అని చెప్తుంది సమంత. సినిమా లో వాళ్ళు కనిపిస్తే చాలు ఆడియన్స్ ఫిదా అయిపోతారు, హీరోలకు ఉండే క్రేజ్ అలాంటిది. మేము సోలోగా ఎన్ని హిట్ సినిమాలు చేసిన మాకు దక్కాల్సిన ఇమేజ్ క్రేజ్ రాదు. హీరోయిన్స్ ఎంత కష్టపడినా వారికి హీరోలతో సమానమైన గుర్తింపు ఎప్పటికి రాదు అని సంచలమైన విషయాలు బైట పెట్టింది సమంత. సమంత చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయంగా మారాయి, సమంత చెప్పింది నూటికి నూరుపాళ్లు కరెక్ట్ అంటూ కొందరు నెటిజన్స్ చెబుతున్నారు.

