
సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. జీవితంలో వేగం తగ్గించి, వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో లోతైన, అర్థవంతమైన బంధాలను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నవ్వుతూ ఉన్న ఒక ఫొటోను షేర్ చేస్తూ, తన కొత్త ఏడాది లక్ష్యాల జాబితాను బయటపెట్టారు. “2026లో నేను.. కృతజ్ఞత, లోతైన బంధాలు, ప్రశాంతమైన పని, స్థిరమైన ఎదుగుదల, లక్ష్యానికి అనుగుణంగా నడవడం” వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు.
డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్‌లో రాజ్ నిడిమోరుతో సమంత వివాహం అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. వివాహం అనంతరం ఈ జంట ఇటీవల ముంబైలో తొలిసారిగా జంటగా కనిపించారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ సమయంలో రాజ్, సమంత మధ్య తొలిసారిగా పరిచయం ఏర్పడగా, ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్‌కు వారు కలిసి పనిచేశారు..!!

