in

Yash Changes ‘Toxic’ Shooting Location For Mom-To-Be Kiara Advani?

KGF స్టార్ యష్ హీరోగా గీతా మోహన్ దాస్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా టాక్సిక్. K.G.F లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత యష్ చేస్తున్న ప్రాజెక్ట్ గా టాక్సిక్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటిదాకా బెంగుళూరులో షూటింగ్ జరుపుకున్న టాక్సిక్ సినిమా షూటింగ్ ని ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. టాక్సిక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కియరా ప్రస్తుతం ప్రెగ్నంట్ గా ఉన్నారు..

ఆమెను ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సినిమాను ముందు బెంగుళూరులోనే షూట్ చేయాలని అనుకున్నా కియరా అద్వాని కోసం షూటింగ్ స్పాట్ ని ముంబైకి మార్చేస్తున్నారట. ఇందుకు హీరో యష్ కూడా చాలా సపోర్ట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. యష్ టాక్సిక్ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చి రిలీజ్ ప్లాన్ చేశారు. సినిమా ఇప్పటివరకు జరిగిన షూటింగ్ రష్ చూసి మేకర్స్ ప్రాజెక్ట్ పై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు..!!

Samantha Says No to ‘Ye Maaya Chesave’ Promotions!

AP High Court slams Kannappa for release Without Censor Clearance!