in

Samantha revealed about her first salary income!

సౌత్ ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న క‌థానాయిక‌ల్లో స‌మంత ఒక‌రు. ఒక్కో సినిమా కోసం  సమంత మూడు నుంచి ఐదు కోట్ల వ‌ర‌కు పారితోషికాన్ని తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం కోట్ల‌లో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న స‌మంత తొలి సంపాద‌న మాత్రం ఐదు వంద‌లేన‌ట‌. ఈ విష‌యాన్ని ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డించింది. ‘టెన్త్ స్టాండర్డ్ లేదా లెవ‌న్త్ స్టాండ‌ర్డ్ అన్న‌ది గుర్తులేదు. కానీ ఓ హోట‌ల్‌లో జ‌రిగిన కాన్ఫ‌రెన్స్‌కు హోస్ట్‌గా ప‌నిచేశాను.

ఎనిమిది గంట‌లు వ‌ర్క్ చేసినందుకు ఐదు వంద‌లు పారితోషికాన్ని అందుకున్నా’ అని చెప్పింది..సంతోషంగా ఉండ‌టానికి ఎలాంటి ఇంగ్రిడెంట్స్ ఉండ‌వ‌ని, అన్ని ఒత్తిళ్ల‌ను ప‌క్క‌న‌పెట్టి ఉద‌యాన్నే మేల్కొంటాన‌ని, రోజంతా ఆనందంగా ఉండ‌టానికే ప్ర‌య‌త్నిస్తాన‌ని అదే త‌న హ్యాపీనెస్ తాలూకు సీక్రెట్ అని చెప్పింది.  నిరంత‌రం క‌ల‌ల వెంట ప్ర‌యాణాన్ని సాగిస్తున్నాన‌ని చెప్పింది.  థియేటర్ లో తాను చూసిన తొలి సినిమా జూరాసిక్ పార్క్ అని వెల్లడించింది. ఇకపై ఎప్పుడూ టాటూలు వేయించుకోకూడదని అనుకుంటున్నట్లు తెలిపింది.

chiranjeevi ni gurthupattani babu mohan!

Kiara Advani says ‘I’m single till I’m married’ amid dating rumours!