in

Samantha refuses to star in Netflix’s Bahubali series?

బాహుబ‌లి క‌థ సుఖాంతం కూడా అయ్యాక‌.. ఇప్పుడు కొత్త‌గా అందులో స‌మంత న‌టించ‌డ‌మేంట‌ని డౌట్ వ‌చ్చింది క‌దా. అయితే ఈ మేటర్ సినిమా బాహుబ‌లి గురించి కాదులేండి. బాహుబ‌లి- బిఫోర్ ది బిగినింగ్ పేరుతో నెట్‌ఫ్లిక్స్ చేస్తున్న వెబ్ సీరిస్ గురించి. శివ‌గామి పాత్ర‌ను హైలెట్ చేస్తూ నెట్‌ఫ్లిక్స్ అప్పుడెప్పుడో ఓ ప్రాజెక్టును మొద‌లుపెట్టింది. కొన్నాళ్లు షూటింగ్ అయ్యాక‌.. ఔట్‌పుట్ బాగాలేద‌ని అప్ప‌ట్లోనే దాన్ని ప‌క్క‌కుపెట్టింది. అయితే ఇప్పుడు మ‌ళ్లీ ఆ ప్రాజెక్టును తెర‌పైకి తీసుకురావాల‌ని అనుకుంటోంద‌ట నెట్‌ఫ్లిక్స్.

ఇటీవ‌లే ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సీరిస్‌తో మంచి పేరు తెచ్చుకున్న స‌మంత‌ను.. తాజాగా బాహుబ‌లి- బిఫోర్ ది బిగినింగ్‌లో లీడ్ రోల్‌లో న‌టించాల‌ని నెట్‌ఫ్లిక్స్ కోరింద‌ట‌. అడిగినంత రెమ్యున‌రేష‌న్ కూడా ఇస్తాన‌ని ఆఫ‌ర్ చేసింద‌ట‌. అయితే స‌మంత ఇంకా రిప్లై ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు శివ‌గామి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ జీవించింద‌ని, తాను ఆ పాత్ర‌ను చేస్తే తేలిపోయే అవ‌కాశ‌ముంద‌ని ఆమె ఫీల్ అవుతోంద‌ట‌. దీంతో మ‌రోసారి బాహుబ‌లి- బిఫోర్ ది బిగినింగ్ డైలామాలో ప‌డిన‌ట్ట‌యింది.

Prabhas REJECTED brand endorsements worth Rs 150 crore!

telugu anchor varshini shines in white!