in

samantha not much interested in doing pan india films?

రీసెంట్ గా స‌మంత  కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ కి వెళ్ళింది. సామ్ అక్కడికి వెళ్ళటం ఇదేం మొదటి సారి కాదు. తరచుగా అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఫౌండేషన్ లో ధ్యానం చేస్తున్న ఫొటోలని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ‘మనలో చాలామంది గురువు లేదా మెంటార్‌ కోసం వెతుకుతుంటారు. మ‌న జీవితానికి వెలుగు చూపుతూ, స‌రైన మార్గంలో న‌డిపించే వ్య‌క్తిని కనుక్కోవటం చాలా ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భం’ అని కూడా రాసి పోస్ట్ చేసింది. జ్ఞానం కోసం ప్రపంచం మంతా వెతకాలని, అంతా సులభంగా దొరకదని, వేదాంతం కూడా వల్లించింది.

అన్ని రకాలుగా కోలుకున్న సామ్, సినిమాలు సంగతి పక్కనపెట్టి మళ్ళీ ఇలా ఆశ్రమం బాట పట్టిందేంటని ఫాన్స్ కలవరపడుతున్నారు. ఆశలే సినిమాకొక కొత్త హీరోయిన్ వస్తున్నటైం లో కెరియర్ ని ప్లాన్ చేసుకోకుండా ఇలా గుళ్ళు, గోపురాలు, ఆశ్రమాలు, తిరుగుతూ కాలక్షేపం చేస్తోందని వాపోతున్నారు. తోటి హీరోయిన్స్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో భాగం అయ్యి వరుస అవకాశాలతో బిజీగా మారుతుంటే సామ్ మాత్రం యోగాలు , మెడిటేషన్ అంటూ ఇంత కూల్ గా ఉందని కామెంట్స్ పెడుతున్నారు..!!

‘avunu’ vijay devarakonda missed ravi babu’s movie!

Rashmika Mandanna Defends Her Character In Ranbir Kapoor’s Animal!