మాఇంటి బంగారం’ మూవీ అనౌన్స్ చేసి కూడా చాలా కాలం అయ్యింది. గతంలో టైటిల్ లుక్ విడుదల చేసినా ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు. గతంలో ఓ ఈవెంట్‌లో జూన్ నుంచి ఈ మూవీ ట్రాక్‌లోకి ఎక్కనుందని సమంత స్వయంగా ప్రకటించినా అది కూడా కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ ప్రాజెక్టుపై ఓ క్రేజీ బజ్ వైరల్ అవుతోంది.
‘మా ఇంటి బంగారం’ మూవీకి స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘ఓ బేబీ’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇప్పుడు అదే హిట్ కాంబో రిపీట్ కానుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. అలా మొదలైంది, కల్యాణ వైభోగమే, అన్నీ మంచి శకునములే మూవీస్‌తో నందిని రెడ్డి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే రేంజ్‌లో ఈ మూవీ కూడా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం త్వరలోనే ఇద్దరూ సెట్స్‌లోకి అడుగు పెట్టబోతున్నారనే టాక్ వినిపిస్తోంది..!!