in

Samantha Launches Luxury Fashion Brand ‘TRULY SMA’!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఒకవైపు నటిగా రాణిస్తూనే, మరోవైపు వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అనారోగ్యం కారణంగా కొంతకాలం సినిమాలకు విరామం తీసుకున్న ఆమె, ఇప్పుడు మళ్లీ కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. వరుసగా చిత్రాలకు సంతకాలు చేయడమే కాకుండా, నిర్మాతగానూ మారారు. తాజాగా వ్యాపార రంగంలో మరో కొత్త అడుగు వేశారు..

సమంత తాజాగా ‘ట్రూలీ స్మా’ (Truly Sma) పేరుతో తన కొత్త క్లాతింగ్ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ‘ఒక కొత్త అధ్యాయం మొదలైంది’ అనే క్యాప్షన్‌తో ఓ ప్రమోషనల్ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు “వ్యాపారవేత్తగా కూడా సమంత విజయం సాధించాలి” అంటూ తమ మద్దతు ప్రకటిస్తున్నారు..!!

Keerthy Suresh’s ‘Revolver Rita’ Gets A Release Date!

Meenakshi Chaudhary: no more mother roles