in

samantha is learning martial arts and horse riding!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఇటీవల మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. దీని నుంచి కోలుకోవడానికి సామ్‌ కొన్ని రకాల ప్రకృతి చికిత్సలను సైతం తీసుకుంటోంది. దీంతో ఇప్పుడు కాస్త కోలుకుంటోన్న ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ కానుంది. ఈ విషయాన్ని స్వయంగా సమంతే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఓ సినిమా కోసం తాను ప్రస్తుతం మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంటున్నట్లు వెల్లడించింది.

మార్షల్‌ ఆర్ట్స్‌తో పాటుగా ఆర్చరీ, హార్స్‌ రైడింగ్‌ లాంటివీ నేర్చుకుంటున్నట్లు సమంత చెప్పుకొచ్చింది. తాను ఇండస్ట్రీలోకి వచ్చే 15 ఏళ్ల అవుతోందని చెప్పింది. అప్పటి నుంచి చాలా ఒడిదొడుకులను ఎదుర్కొన్నట్లు తెలిపింది. కొన్ని సార్లు కింద పడి మళ్లీ పైకి లేచిన విషయాన్ని గుర్తు చేసుకుంది. ఇప్పుడు మళ్లీ కొత్త స్టూడెంట్‌లా కెమేరా ముందుకు రావాలని అనుకుంటున్నట్లు తెలిపింది. అందుకనే ఓ సినిమాలోని పాత్ర కోసం తాను మళ్లీ కొత్తగా రెడీ అవుతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం సామ్‌ సిటాడెల్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. ఆ తర్వాత మలయాళం మెగాస్టార్‌ మమ్ముట్టితో ఒక సినిమా చేయబోతోంది..!!

rgv: #SSMB29 will be the “baap” of all films

Prabhas reduces His Remuneration For ‘Raja Saab’!