వీరిద్దరూ విడిపోయి దాదాపు నాలుగు సంవత్సరాలు కావొచ్చింది. ఇక నాగచైతన్య తిరిగి మరొక నటి శోభితను కూడా పెళ్లి చేసుకున్నారు. అయినప్పటికీ నాగచైతన్య సమంత గురించి ఏదో ఒక వార్త నిత్యం వినపడుతూనే ఉంటుంది. తాజాగా సమంత సిడ్నీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సమంత చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. రూల్స్ పెడితే తనకు నచ్చదని..నాకు ఇష్టం వచ్చినట్లు జీవించాలను కుంటున్నానని సమంత చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి..
సక్సెస్ అంటే గెలవడం మాత్రమే కాదని, ప్రయత్నించడం కూడా విజయంలో ఒక భాగమే అంటూ ఆమె చెప్పుకొచ్చారు.సినిమాల్లో తనకు నచ్చిన పాత్రలు చేస్తానని,అప్పుడే నా లైఫ్ సక్సెస్ అవుతుందని తెలిపారు. అయితే సమంత ఈ కామెంట్స్ నాగచైతన్యను ఉద్దేశించి చేశారని పలువురు భావిస్తున్నారు అక్కినేని ఫ్యామిలీ ఈమె విషయంలో కండిషన్లు పెట్టడం వల్లే గొడవలు మొదలయ్యి విడాకులు తీసుకొని బయటకు వచ్చేసారంటూ పలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..!!