చైతు, శోభిత ఎంగేజ్ మెంట్ న్యూస్ బయటిక్ రాగానే నెటిజన్స్ ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. కొందరు సమంత తరపున వకాల్తా పుచ్చుకుని చైతూని నిలదీసారు. మరి కొందరు శోభిత పై పడ్డారు. ఆమె నటించిన సినిమాలు, వెబ్ సిరీస్, యాడ్స్ ప్రస్తావిస్తూ, కండోమ్ యాడ్ లో కూడా చాలా బోల్డ్ గా నటించిందని, ఆమెతో చైతూకి పెళ్లి ఏంటని హితవు చెప్తున్నారు. అంతే కాదు సమంతతో శోభితని పోల్చుతూ దారుణంగా విమర్శిస్తున్నారు..
Samantha Fans Troll Newly Engaged Chaitanya And Sobhita!
నటన ఆమె వృత్తి, మనసుకి ఏది నచ్చితే అది చేసే స్వేచ్ఛ ప్రతి నటికీ ఉంటుంది. మీకు నచ్చకపోతే చూడటం మానేయండి, ఇన్నాళ్లు తప్పుకాని విషయం పెళ్లి చేసుకుని కోటి ఆశలతో కొత్త జీవితంలోకి ప్రవేసిస్తున్నప్పుడు తప్పు అయ్యిందా అని కొందరి వాదన. శోభిత చదువులో టాప్, మోడలింగ్ లో టాప్, అందాల పోటీలలో కిరీటాలు అందుకుంది. ఒక తెలుగమ్మాయి హాలీవుడ్ స్థాయికి ఎదిగింది. అంటే ఎంత శ్రమ, పట్టుదల ఉండాలి. అవన్నీ వదిలేసి అనవసరమైన న్యూసెన్స్ ఏంటి అని చైతు ఫాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు..!!