in

samantha extended cameo in puhspa 2?

పుష్ప 2 లో కూడా ఒక ఐటెం సాంగ్ ఉందని , దాని కోసం సామ్ ని సంప్రదించగా నో చెప్పింది. ఎన్ని సార్లు మేకర్స్ అప్రోచ్ అయినా సామ్ అంగీకరించలేదు. దీనితో ఇప్పటివరకు ఈ పాట పూర్తి చేయలేదు. పెండింగ్ లోనే ఉండి పోయింది. ఐటెం సాంగ్ కోసం జాన్వీ కపూర్, త్రిప్తిదిమ్రి పేర్లు వినిపించాయి. కానీ ఇంతలోనే పుష్ప 2లో మళ్లీ సమంత ఒక స్పెషల్ సాంగ్ చేస్తోందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. పుష్ప 2 లో రెండు ప్రత్యేక గీతాలున్నాయని అందులో ఒకటి చాలా స్పెషల్ అని వినిపించింది.

ఇప్పుడు ఈ పాట కోసమే సామ్ ని మళ్ళీ మేకర్స్ అప్రోచ్ అయినట్లు సమాచారం..ఊ అంటావా పాటని మించి ఈ పాట ఉండనుందని టాక్. అంతే కాదు స్పెషల్ సాంగ్ తో పాటు, గెస్ట్ రోల్ లో కూడా సామ్ కనిపిస్తుందని తెలుస్తోంది. పుష్ప 2లో సామ్ నటిస్తే ఇంకొంచెం క్రేజ్ పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారట. పుష్ప3 లో సామ్ పాత్రకి  కొనసాగింపు కూడా ఉండేటట్లు పాన్ చేస్తున్నారట సుక్కు.  ఈ న్యూస్ విన్న సామ్ ఫాన్స్ మళ్ళీ తన హవా సాగిస్తుందని, టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ తో రీ ఎంట్రీ  ఇస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు..!!

Ananya Nagalla Responds to Casting Couch Question!

3 releases for meenakshi Chaudhary in just 1 month!