సాధారణంగా చాలా సినిమాలు అంగీకరించవచ్చు కానీ..నా లైఫ్ లో ప్రతి దాన్ని చివరిదాని గానే భావించే దశలో ఉన్నా. ఈ క్రమంలోనే కచ్చితంగా ఆడియన్స్ పై ప్రభావాన్ని చూపించే సినిమాలను మాత్రమే సెలెక్ట్ చేసుకుని నటిస్తున్న. 100% నేను నమ్మకపోతే ఆ సినిమాను చేయలేను. అందుకే పూర్తిగా నమ్మకం కలిగిన కథలను మాత్రమే తీసుకుంటున్న అంటూ సమంత చెప్పుకొచ్చింది..
ఇక రాజ్ అండ్ డీకేతో ఎక్కువగా పనిచేయడానికి కూడా కారణం ఇదేనని.. వాళ్ళు ఎక్కువగా అడ్వెంచరస్ అనిపించే పాత్రలనే డిజైన్ చేస్తున్నారు. వారితో కలిసి పని చేయడం నాకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది..నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలను ఎక్కువగా వాళ్ళు రూపొందిస్తున్నారు. గొప్ప సినిమాల్లో నటించానని భావన రాకపోతే నేను పనిచేయలేను అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఇక సమంత ఇప్పటివరకు రాజ్ అండ్ డీకె డైరెక్షన్‌లో ‘ఫ్యామిలి మెన్’ ఎబ్ సిరీస్‌తో పాటు..’సిటాడెల్ హనీ..బనీ’ లో నటించిన సంగతి తెలిసిందే..!!