బాలీవుడ్ లో వరుస వెబ్ సిరీస్ లలో నటించటానికి, వాటిని నిర్మించటానికి రాజ్ అండ్ డీకేతో పార్ట్నర్ గా మారింది. చైతు శోభిత పెళ్లి కారణంగా సామ్ రియాక్షన్ ఏంటో చూడాలని ఎదురుచూస్తున్న వారికి నిరాశ మిగిల్చి కొత్త జర్నీ కూడా మొదలు పెట్టింది. ఇప్పటికే సమంత ఫ్యాషన్, స్కూల్స్, హోటల్స్ లాంటి బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టగా రీసెంట్ గా మరో కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టింది. స్పోర్ట్స్ బిజినెస్ లోకి సామ్ ఎంట్రీ ఇచ్చింది.
వరల్డ్ పికెల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజ్ కి పార్ట్నర్ గా న్యూ జర్నీ మొదలు పెట్టింది. మాజీ టెన్నిస్ ప్లేయర్ ‘గౌరవ్ నటేకర్’ తో కలిసి సామ్ పికెల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంజైజ్ ని తీసుకుంది. ఈ విషయాన్ని సమంత అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. పికెల్ బాల్ చెన్నై ఫ్రాంచైజ్ తీసుకున్నందుకు థ్రిల్ ఫీల్ అవుతున్నాను అంటూ గౌరవ్ తో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసి సామ్ ఈ న్యూస్ ని ఫాన్స్ తో షేర్ చేసుకుంది. దీంతో సామ్ ఫాన్స్, సెలబ్రిటీస్ కంగ్రాట్స్ చెప్తూ, ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నారు..!!