సమంత ఎట్టకేలకు రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో రిలేషన్ ను పెట్టేసినట్టు తెలుస్తోంది. ఆమె తాజాగా పోస్టు చేసిన ఫొటోనే ఇందుకు సాక్ష్యం. పైగా జర్నీ బిగిన్స్ అంటూ రాసుకొచ్చింది. చూస్తుంటే రిలేషన్ ను ఇన్ డైరెక్ట్ గా చెప్పేసిందేమో అనిపిస్తోంది. సమంత, రాజ్ నిడుమోరు రిలేషన్ లో ఉన్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా వీరిద్దరూ కనీసం స్పందించలేదు. అలా అని కొట్టిపారేయలేదు. చాలా రోజులుగా వీరిద్దరూ కెమెరాల ముందుకు రాలేదు.
కానీ నాగచైతన్య, శోభిత పెళ్లి తర్వాత నుంచే సమంత రాజ్ తో కలిసి ఎక్కువగా తిరుగుతోంది. మొన్న శ్రీకాళహస్తిలో పూజలు కూడా చేసింది ఈ జంట. అప్పటి నుంచి ఇద్దరూ ఎప్పటికప్పుడు బయట కనిపిస్తున్నారు. తాజాగా సమంత ఓ పోస్టు చేసింది. ఇందులో రాజ్ తో కలిసి దిగిన సెల్ఫీ ఫొటో ఉంది. ఇందులో రాజ్ భుజం మీద సమంత వాలిపోయి సెల్ఫీ తీసుకుంది. ఇంత క్లోజ్ గా ఫొటో దిగడాన్ని చూసిన నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ కన్ఫర్మ్ చేసేస్తున్నారు. త్వరలోనే వీరిద్దరూ అధికారికంగా తమ రిలేషన్ ను బయట పెట్టాలని చూస్తున్నారంట..!!