అక్కినేని ఫ్యామిలీకి సమాజంలో గౌరవముందని, అక్కినేని ఇంటి కోడలిగా నీకు ఆ బాధ్యత ఉంటుందని, కాస్త గౌరవంగా ఉండాలంటూ ఎంత చెప్పినా సమంత పెడచెవిన పెట్టేదట. అయిన కొడుకు నాగచైతన్య కోసం ఇన్ని రోజులు చూసి చూడనట్టే ఉంటున్నారట నాగార్జున. అయితే నాగార్జునకి తీవ్రంగా బాధపెట్టిన అంశం.. లేటెస్ట్ గా సమంత పోషించిన రాజి పాత్రే అని టాక్ వినపడుతుంది. బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మెన్’ లో.. శ్రీలంక తీవ్రవాదిగా సమంత పోషించిన బోల్డ్ క్యారెక్టర్ అక్కినేని కుటుంబానికి తీవ్ర ఆగ్రహజ్వాలలు తెచ్చేలా చేసిందట. ఆ వెబ్ సిరీస్ లో సమంత కొన్ని శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించటంతో పలువురు నుండి అక్కినేని ఫ్యామిలీకి అవమానకర మాటలు పడాల్సివచ్చిందట..
దాంతో అక్కినేని ఫ్యామిలీ సమంతని వివరణ అడుగగా… ఏకంగా ఆ అక్కినేని ఇంటిపేరునే తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి తీసేసిందట సమంత. అక్కడితో మొదలైన ఈ రచ్చ ఇప్పుడు ఏకంగా చైతన్య లాంటి మంచి మనసున్నభర్తని కూడా వదిలేసే స్టేజికి సమంత వచ్చేసిందట. తన స్వేచ్చకీ, అక్కినేని కుటుంబానికి సెట్ అవ్వదని సమంత విడాకులు తీసుకోబోతుందని అంటున్నారు. దీనికి కోసం సమంతకి భరణం కూడా అందుతుందట. విడాకుల తరువాత 300 నుండి 350కోట్ల వరకు భరణం కూడా సమంతకి ఇచ్చేందుకు నాగార్జున ఒప్పుకున్నట్టు సోషల్ మీడియాలో తాజాగా వార్తలొస్తున్నాయి.