
సాధారణంగా కళ్యాణ్ సినిమాలో చిన్న ఛాన్స్ వచ్చినా ఏ హీరోయిన్ అయినా వదులుకోవడానికి ఇష్టపడదు. కానీ, ఒక యంగ్ బ్యూటీ మాత్రం పవన్ సరసన నటించే లక్కీ ఛాన్స్ వచ్చినా..ఏకంగా వారం రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాక సినిమా నుంచి తప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ‘ఏజెంట్’ బ్యూటీ సాక్షి వైద్య. పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’..
ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండగా, ఒకరు శ్రీలీల కాగా.. మరొక హీరోయిన్‌గా మొదట సాక్షి వైద్యను ఎంపిక చేశారు. సాక్షి వైద్య ఈ సినిమా కోసం వారం రోజుల పాటు షూటింగ్‌లో కూడా పాల్గొంది. పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించడం తన డ్రీమ్ అని ఆమె గతంలో చాలాసార్లు చెప్పుకొచ్చింది. బిజీ షెడ్యూల్ కారణంగా డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని సాక్షి తాజాగా వెల్లడించింది. పవన్ సినిమా వంటి పెద్ద ఆఫర్‌ను వదులుకోవడం బాధాకరమే అయినా, అనివార్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపింది..!!

