సాక్షి అగర్వాల్. ఈమె తమిళ హీరోయిన్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. కాగా ఈమె ఒకరోజు పన్నీర్ బిర్యానీ తినాలని అనిపించి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసిందట. అయితే మంచి ఆకలి మీద ఉండటంతో పన్నీర్ బిర్యానీ అనుకునే తినడం మొదలు పెట్టిందట. సగం తిన్న తర్వాత అనుమానంగా అనిపించి చూస్తే అది పన్నీర్ బిర్యాని కాదు చికెన్ బిర్యాని అని అర్థమయ్యే ఆమె షాక్ అయిందట..
అలా జీవితంలో నేను నాన్ వెజ్ తినకూడదు అనుకున్నాను. కానీ నాతో చికెన్ తినేలా చేశారు అంటూ చూసిన మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే రెస్టారెంట్ నిర్లక్ష్యం వహించడంపై ఆమె మండిపడుతూ.. సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. సదురు సదరు రెస్టారెంట్ పై తగిన చర్యలు తీసుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!