in

Saiyami Kher reveals shocking casting couch experience in Tollywood!

యామీ ఖేర్ 2015లో ‘రేయ్’ అనే తెలుగు సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 2016లో ‘మిర్జియా’తో హిందీలో అడుగుపెట్టారు. సయామీ మాట్లాడుతూ, “నా కెరీర్ తొలినాళ్లలో, ఓ తెలుగు సినిమా ఏజెంట్ నన్ను కలిశారు. సినిమా అవకాశాల కోసం కొన్ని విషయాల్లో ‘సర్దుకుపోవాల్సి’ ఉంటుందని ఆమె నాతో అన్నారు. ఒక మహిళ అయి ఉండి మరో మహిళతో ఇలా మాట్లాడటం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది” అని వివరించారు.

ఆ ఏజెంట్ మాటలకు తాను మొదట అర్థం కానట్లు నటించానని, కానీ ఆమె పదేపదే అదే విషయం ప్రస్తావించడంతో, “క్షమించండి, మీరు నన్ను ఆ మార్గంలో వెళ్లమని సూచిస్తున్నారని అనుకుంటున్నాను. కానీ నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి, వాటిని నేను ఎప్పటికీ దాటను,” అని సున్నితంగా తిరస్కరించినట్లు సయామీ తెలిపారు. తన సినీ జీవితంలో ఓ మహిళ నుంచి ఇలాంటి ప్రతిపాదన రావడం అదే మొదటిసారి, చివరిసారి అని ఆమె పేర్కొన్నారు..!!

niharika konidela to do love story with allu arjun!