బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి!
దేశవ్యాప్తంగా అభిమానులను కలిగివున్న బాలీవుడ్ అగ్రనటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇవాళ గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఆయన నివాసంలోనే కత్తి దాడి జరిగిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన అతడిని ముంబైలోని లీలావతి హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
సైఫ్ అలీఖాన్ పై తన నివాసంలో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తి!
సైఫ్ అలీఖాన్ శరీరంపై ఆరు కత్తిపోట్లు ఉన్నాయని, అందులో రెండు లోతైన తీవ్ర గాయాలని వైద్యులు ప్రకటించారు. మెడ, వెన్నెముకపై కత్తి పోట్లు లోతుగా దిగాయని వివరించారు. ప్రస్తుతం ఆయనకు శస్త్రచికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. సైఫ్ దాడి ఘటనపై పోలీసులు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించినట్టు గుర్తించామని తెలిపారు. సైఫ్‌కు, దుండగుడికి మధ్య కొద్దిసేపు పెనుగులాట జరిగిందని, ఈ క్రమంలోనే సైఫ్ కత్తిపోట్లకు గురయ్యారని వాంగ్మూలంలో పోలీసులు పేర్కొన్నారు..!!