ఊర్వశి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..డాకు మహారాజ్ సినిమా విజయం తర్వాత తనకు ఎంతోమంది బహుమతులు పంపించారని తెలిపింది. సైఫ్‌పై దాడి దురదృష్టకరమని, తాను నటించిన డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్‌గా నిలిచిందని పేర్కొంది. ఇప్పటి వరకు ఈ మూవీ రూ. 150 కోట్ల వసూళ్లు సాధించిందని తెలిపింది..
మూవీ విజయం సాధించడంతో అమ్మ తనకు వజ్రపుటుంగరం ఇస్తే, నాన్న రోలెక్స్ వాచీ ఇచ్చారని ఆనందంగా చెప్పుకొచ్చింది. అయితే, వీటన్నింటినీ ధరించి బహిరంగంగా బయటకు వెళ్లలేనని, ఎందుకంటే ఎవరైనా మనపై అలా (సైఫ్‌పై దాడిచేసినట్టు) దాడి చేస్తారన్న భయం ఉంటుందని చెప్పుకొచ్చింది. సైఫ్‌పై దాడికి, తన బహుమతులకు ముడిపెట్టి మాట్లాడటంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో క్షమాపణలు చెప్తూ తాజాగా ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది..!!