in

sai tej and sai srinivas to do a multi starrer?

సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది కామెడీ. ఆయన ఇప్పటి వరకు ఐదు సినిమాలకు దర్శకత్వం వహించగా అన్నీ సూపర్ హిట్లుగా నిలిచాయి. ఆయన సినిమాల్లో ఒక దానిని మించి ఒకటి పెద్ద విజయాలు సాధించడం విశేషం. స్క్రిప్ట్, డైలాగ్ రైటర్ నుంచి దర్శకుడిగా మారిన అనిల్.. ‘పటాస్’ సినిమాతో మెగా ఫోన్ పట్టారు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తరవాత ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘F2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’, ‘సరిలేరు నీకెవ్వరు’తో ఫామ్‌ను కొనసాగించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన ఆయన గత చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.. సంక్రాంతి కానుకగా వచ్చి బాక్సాఫీసు వద్ద రూ.100 కోట్లు రాబట్టింది. ఇదిలా ఉంటే, సూపర్ హిట్ మూవీ ‘F2’కు సీక్వెల్‌గా ‘F3’ని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లాక్‌డౌన్ సమయంలో F3 స్క్రిప్ట్ వర్క్‌ను అనిల్ పూర్తి చేసినట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

ఆ సినిమాలు పూర్తిచేస్తే కానీ అనిల్‌కు తేదీలు ఇవ్వలేరు. అందుకే, వాళ్లు ఖాళీ అయ్యే లోపు మరో సినిమాను అనిల్ ప్లాన్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, అనిల్ దగ్గర ఒక కామెడీ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందట. దీనికి ‘నాలుగు స్తంభాలాట’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారట. ఇద్దరు యంగ్ హీరోలతో ఈ సినిమా చేస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ సినిమాకు అనిల్ రావిపూడి కథ, కథనం, మాటలు మాత్రమే అందిస్తున్నారని అంటున్నారు. ‘నేను లోకల్’ ఫేమ్ త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని టాక్. సాయి ధరమ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోలుగా నటిస్తారని, దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. తక్కువ బడ్జెట్‌లో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోందని అంటున్నారు..

September 5th sentiment for nani!

nag to repeat super combo again!