రీసెంట్ గా ‘అమరన్’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ రిలీజైన నాలుగు రోజుల్లోనే 100 కోట్లు పైగా కలక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా విజయం లో సాయి పల్లవిది కీలక పాత్ర అని చెప్పొచ్చు. సాయి పల్లవి ఎమోషన్స్ ఈ మూవీకి హైలెట్ అయ్యాయి. అమరన్ రిలీజ్ ముందు సాయి పల్లవి విపరీతంగా ట్రోల్స్ , విమర్శలు ఎదుర్కొంది. కారణం అప్పుడెప్పుడో మాట్లాడిన మాటల్ని వక్రీకరించి సాయి పల్లవి ఇండియన్ ఆర్మీని టెర్రరిస్టులు అంది అని బాయ్ కాట్ సాయి పల్లవి అని ట్రోల్స్ చేసారు. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయ్యి ఆమెకి మంచి పేరు వచ్చింది. ఎందరు ఎన్ని రకాలుగా సాయిపల్లవిని టార్గెట్ చేసినా అవి కూడా కలిసి వచ్చి సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
Sai Pallavi,The Queen of box office!
ఏ సినిమా ముందు అయితే విమర్శలు ఎదుర్కొందో అదే సినిమా ఆమెనిప్పుడు ‘క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్’ చేసింది. తాజాగా తండేల్ రిలీజ్ డేట్ అనౌన్స్ లో నిర్మాత బన్నీ వాసు, హీరో నాగ చైతన్య ఇద్దరూ అమరన్ సినిమా విజయాన్ని ప్రస్తావిస్తూ సాయి పల్లవిని ‘క్వీన్ ఆఫ్ బాక్సాఫీసెస్’ అని కీర్తించారు. ఇప్పటికే సాయి పల్లవికి ఉన్న క్రేజ్ ని దృష్టిలోపెట్టుకుని సుకుమార్ ఆమెకి ‘లేడీ పవర్ స్టార్’ ట్యాగ్ ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ కి ఉన్నంత క్రేజ్ ఆమెకి ఉంది. ఇప్పుడు కొత్తగా క్వీన్ ఆఫ్ బాక్సాఫీసెస్ చేరింది..!!