పహల్గాం ఉగ్రదాడి ఎంతోమందిని కలిచివేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అప్పుడే పెళ్లయిన కొత్త జంట సరదాగా అక్కడికి వెళ్లి తమ జీవితంలో మధురమైన జ్ఞాపకాలను మిగిల్చకుందామని వెళ్లిన వారికి విషాదకరంగా మిగిలిపోయాయి. ఇలా ఎంతోమంది అర్ధనాథాలతో పహల్గాం గుండె బరువెక్కింది. సినీనటి సాయి పల్లవి గతంలో ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇదే విషయం గురించి మాట్లాడుతూ..
మన ఇండియన్స్ పాకిస్తాన్ ఆర్మీని ఉగ్రవాదులుగా చూస్తారు అలాగే పాకిస్తానీ ఆర్మీ మన ఇండియన్స్ ఉగ్రవాదులుగా చూస్తారు. ఇదే హింసకు కారణం అవుతుంది. మనం ఆలోచించే విధానం అలాంటిది అంటూ ఇవే మాట్లాడారు అయితే ఈమె మాట్లాడిన మాటలలో తప్పు లేకపోయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఈమె చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే తాజాగా ఈ వీడియోలను మరోసారి వైరల్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడటానికి నీకు నోరు ఎలా వచ్చింది కనీసం బుర్ర ఉండి మాట్లాడవా అంటూ కామెంట్లు చేస్తున్నారు..!!