in

Sai Pallavi turns pan India star from natural star!

లాంటి పాత్ర‌లో అయినా ప‌రకాయ ప్ర‌వేశం చేసి ఆడియ‌న్స్ ను మెప్పించ‌గ‌ల‌గడం సాయి పల్ల‌వి స్పెషాలిటీ. అందం ప‌రంగా కంటే సాయి ప‌ల్ల‌వికి న‌ట‌న ప‌రంగానే క్రేజ్ ఎక్కువ‌. అందుకే ఆమె యాక్టింగ్ కు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం సాయి ప‌ల్ల‌వి త‌న కెరీర్లో చాలా బిజీగా ఉంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లోనే కాకుండా ఆమె క్రేజ్ బాలీవుడ్ కు కూడా వెళ్లింది. ఆల్రెడీ సౌత్ లో సినిమాలు చేస్తూనే నార్త్ లో కూడా సినిమాల‌కు రెడీ అయింది. అయితే ప‌ల్ల‌వి చేతిలో ఇప్పుడు రెండు ప్రిస్టీజియ‌స్ ప్రాజెక్టులున్నాయి..

ఆ సినిమాలు రిలీజ‌య్యాక అమ్మ‌డి క్రేజ్ ఎక్క‌డికో వెళ్ల‌డం ఖాయం..అవే రామాయ‌ణ‌, క‌ల్కి2. బాలీవుడ్ లో నితేష్ తివారీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న రామాయ‌ణ‌లో సాయి ప‌ల్ల‌వి సీతా దేవిగా న‌టిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటూ క‌ల్కి2  నుంచి దీపికా ప‌దుకొణె త‌ప్పుకోవ‌డంతో ఇప్పుడా పాత్ర‌కు మేక‌ర్స్ సాయి ప‌ల్ల‌విని ఎంపిక చేశార‌ని స‌మాచారం. ఈ రెండు సినిమాల‌కూ విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. ఆ రెండు సినిమాల త‌ర్వాత సాయి ప‌ల్ల‌వి క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో బాగా పెర‌గ‌డంతో పాటూ త‌ర్వాత ఆమెతో ఎవ‌రైనా సినిమాలు చేయాల‌న్నా కానీ ఆమె కాల్షీట్స్ దొరికడం క‌ష్ట‌మ‌వ‌డం ఖాయం..!!

Samyuktha Menon Action Avatar in “The Black Gold”!

nithya menen Was First Approached For Mahanati!