
అందాల భామ సాయి పల్లవి తన సహజమైన నటనతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సంపాదించుకుంది. ఇక సాయి పల్లవి ఓ సినిమా చేస్తుందంటే ఆ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం ఆమె నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’లో సీతాదేవి పాత్రలో కనిపించనుంది.
అయితే, ఆమె ఇప్పుడు లెజెండరీ కర్ణాటక గాయని ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందే బయోపిక్‌లో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారని, ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మించే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. భారతరత్న పురస్కారం అందుకున్న తొలి సంగీత కళాకారిణిగా ఎం.ఎస్.సుబ్బులక్ష్మి చరిత్ర సృష్టించారు. ఈ బయోపిక్‌లో ఆమె సంగీత ప్రయాణం, కీర్తి ప్రతిష్టలు సాధించిన తీరు ప్రధానంగా చూపించనున్నారు..!!
