in

Sai Pallavi To Replace Deepika Padukone In prabhas Kalki 2?

ప్రభాస్‌ చేతిలో ప్రజెంట్‌ అరడజను సినిమాలు చేతిలో ఉన్నాయి. వీటిలో ప్రజెంట్‌ ‘స్పిరిట్‌’, ‘ఫౌజి’ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ‘స్పిరిట్‌’ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్‌. ఫౌజి సినిమా రిలీజ్‌ ను ఈ ఏడాదే ప్లాన్‌ చేశారు. కానీ ఈ చిత్రం రిలీజ్‌ కూడా వచ్చే ఏడాదే అన్నట్లుగా ఉంది. ఈ రెండు చిత్రాలతో పాటుగా ప్రభాస్‌ ‘కల్కి 2’ సినిమానూ సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని నిర్ణయించు కున్నాడు. ఈ దిశగా నాగ్‌ అశ్విన్‌ కార్యచరణ ప్రారంభించారు. ఫిబ్రవరి మొదటివారంలో ‘కల్కి 2’ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలని ఏర్పాట్లు చేస్తున్నారు..

అయితే ‘కల్కి’ సినిమాలో దీపికా పదుకొనెది చాలా కీలకమైన పాత్ర. కానీ ఈ ప్రాజెక్ట్‌ నుంచి దీపిక పదుకొనెను తప్పించారు మేకర్స్‌. దీంతో దీపిక ప్లేస్‌లో సాయిపల్లవిని తీసుకోవాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. గతంలో ఆలియాభట్, ప్రియాంకా చోప్రా వంటివార్ల పేర్లు వినిపించినా, ఎవరు ఫైనలైజ్‌ కాలేదు..చిత్రీకరణ సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఈ సినిమాలో దీపిక చేసిన సుమతి పాత్రను ఎవరు చేయబోతున్నారనే విషయంపై త్వరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఊహించవచ్చు..!!

finally Samantha decided To Change Her Name!