in

Sai Pallavi takes her highest Remuneration For ‘Thandel’

సాయి పల్లవి నటనకు ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది. ఎందుకంటే గ్లామర్ షో లేకుండా తన టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, సినిమాల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలకే ఎక్కువగా అంగీకరించిన ఆమె, భారీ ప్రొడక్షన్ హౌస్‌లో నటించడం అరుదే. కానీ ఇప్పుడు, నాగచైతన్య సరసన నటిస్తున్న తండేల్ సినిమా కోసం ఆమె కెరీర్‌లోనే భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో ఆమె పారితోషికం కోసం పెద్దగా పట్టించుకోకుండా, స్క్రిప్ట్‌ను బట్టి తన రెమ్యూనరేషన్‌ను తగ్గించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు తండేల్ లాంటి పాన్ఇండియా ప్రాజెక్ట్‌లో నటిస్తుండటంతో, మార్కెట్ రేంజ్‌కు తగ్గట్టుగానే పారితోషికాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ఆమె ఒక సినిమాకు 2 కోట్లకు మించి తీసుకోలేదని సమాచారం. కానీ ఈ సినిమాకు మాత్రం ఏకంగా 5 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి..!!

Will Salman Khan Join Rajinikanth in Atlee’s Next?

Censor Board cuts Pooja Hegde and shahid Kapoor lip lock scenes?