సాయి పల్లవి వస్త్రధారణలో కూడా ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు ఈమె ఎప్పుడు పొట్టి దుస్తుతులు ధరించకుండా సాంప్రదాయ దుస్తులలోనే కనిపిస్తూ ఉంటారు. ఇక సినిమాలలో కూడా ఎక్కడ గ్లామర్ షో అనేది ఉండదు. చాలా పద్ధతిగా ఈమె వస్త్రధారణ ఉంటుంది. అయితే అందరిలాగే పల్లవి ఎందుకు పొట్టి దుస్తులు వేసుకోదనే సందేహాలు చాలామందికి కలిగి ఉంటాయి. ఇలా సాయి పల్లవి పొట్టి దుస్తులు వేసుకోకపోవడానికి కూడా కారణం ఉందని తెలుస్తుంది..
గతంలో తాను టాంగో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయ్యిందని.అందులో తాను పొట్టి దుస్తులు వేసుకుని డ్యాన్స్ చేయడంపై విమర్శలు వచ్చాయని తెలిపింది. అలా ఆ విమర్శలు చూసి నాకే ఎలాగో అనిపించింది అందుకే అప్పటి నుంచి పొట్టి దుస్తులు వేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్టు సాయి పల్లవి తెలిపారు. ఇక సాయి పల్లవి ఎంతో సాంప్రదాయమైన దుస్తులను వేసుకోవడం వల్ల ఆమె సినిమాలు సక్సెస్ కి కారణమని కూడా చెప్పాలి..!!