హీరోయిన్ సాయి పల్లవిని అభిమానులు ముచ్చటగా నేచురల్ బ్యూటీ అని పిలుచుకుంటుంటారు. మిగతా హీరోయిన్ల మాదిరి ఆమె విపరీతమైన మేకప్ తో ఎప్పుడూ కనిపించదు. బ్యూటీ కాస్మొటిక్స్ కంపెనీలు ఆమెను బ్రాండ్ అంబాసడర్ గా తీసుకోవాలనుకున్నా..ఆమె సున్నితంగా తిరస్కరించింది. తాను మేకప్ వస్తువులు వాడనని…
అలాంటప్పుడు తాను ఇలాంటి ప్రాడక్ట్స్ ని ప్రమోట్ చేయలేనని ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. పల్లవికి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా ఎంతో ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆమెకు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ సినిమాలో అవకాశం వచ్చింది. విక్రమ్ సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు. కానీ, సాయి పల్లవి ఆ ఛాన్స్ ను వదులుకుంది. ఆమెకు ఆ డేట్స్ లో కాల్షీట్స్ లేకపోవడంతో ఆ అవకాశాన్ని వదులుకుంది..!!