రెమ్యూనరేషన్ పెంచి ఎలాంటి సినిమాలు పడితే అలాంటి సినిమాలు చేయడం ఆమెకు నచ్చదు. స్కిన్ షోకు కూడా చాలా దూరంగా ఉంటుంది. ఇంత సింపుల్ గా ఉండే ఈ అమ్మాయి జీవితంలో నిజంగా లవ్ అనేది ఉందా అనే విషయం తెలుసుకోవాలని అనిపించింది ఓ యాంకర్ కి. వెంటనే సాయి పల్లవిని ప్రేమ,పెళ్లి గురించి అడిగేసింది. దానికి సమాధానంగా సాయి పల్లవి.. “తన వరకూ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని.. కానీ ఆ బంధాన్ని ఎప్పుడూ గౌరవిస్తానని, అలాగే ప్రేమ పెళ్లి అయితే ఇంకా బాగుంటుందని తన అభిప్రాయం చెప్పుకొచ్చింది. అంతేకాదు ఏడవ తరగతి చదువుతున్నప్పుడే ఓ కుర్రాడిని చాలా సీరియస్ గా లవ్ చేసిందట.
తొలి చూపులోనే అతనిపై అభిమానం, ప్రేమ ఏర్పడ్డాయట. మనసులో ఉన్న ఇష్టాన్ని నోటితో చెప్పలేక లవ్ లెటర్ కూడా రాసిందంట. కానీ ఆ లెటర్ ఇవ్వడానికి భయమేసి తన పుస్తకంలోనే దాచుకుందట. తీరా ఆ లెటర్ కాస్త సాయి పల్లవి వాళ్ళ అమ్మ చూసి బాగా కొట్టిందట. అయితే అలా కొట్టడం కూడా అదే మొదటిసారి..చివరి సారి కూడా అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది ఫ్యాన్స్ సాయి పల్లవి అంటే సైలెంట్ అనుకున్నాం కానీ ఫాస్టే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!