కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఒకేలా ట్రెడిషనల్ పాత్రలో మాత్రమే నటిస్తూ..ఎక్స్పోజింగ్ చేయనంటూ కరకండిగా చెప్పేస్తుంది. ఇక ఈ అమ్మడు చివరిగా నటించిన అమరాన్, తండేల్ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సాయి పల్లవి మరో టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట..
త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రాంపోతునేని హీరోగా తెరకెక్కుతున్న లవబుల్ లవ్ స్టోరీస్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. రియాలిటీ లవ్ స్టోరీ లో ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్.. అలాంటి ఏ ఎక్స్ప్రెషన్ అయినా కేవలం సాయి పల్లవి మాత్రమే పర్ఫెక్ట్ గా ఇవ్వగలుగుతుందని మేకర్స్ నమ్ముతున్నారట. ఈ క్రమంలోనే సాయి పల్లవిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ ప్రకటన కూడా రానుందట..!!